Tirumala:తొక్కిసలాట ఘటన.. మృతుల సంఖ్య పై క్లారిటీ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి

తిరుమల(Tirumala) వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా

Update: 2025-01-09 08:20 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి(CM Chandrababu) ఆదేశాల మేరకు మంత్రుల బృందం తిరుమల రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు(AP Government) ప్రకటించారు. కాగా ఈ తొక్కిసలాట ఘటనపై వైద్యారోగ్య శాఖ(Health Minister) మంత్రి సత్య కుమార్ యాదవ్(Satya Kumar Yadav) స్పందించారు. ఈ క్రమంలో నేడు(గురువారం) బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు.

ఈ తరుణంలో మృతుల సంఖ్య పై మంత్రి సత్యకుమార్(Minister Satya Kumar Yadav) క్లారిటీ ఇచ్చారు. చిన్న చిన్న దెబ్బలు తగిలిన అందరూ కోరుకుంటున్నారు అని తెలిపారు. ఒక వ్యక్తికి ఫ్యాక్చర్ గాయాలు ఉన్నాయి. తొక్కిసలాటలో ఐదుగురు చనిపోయారు. క్యూ లైన్ లో అస్వస్థతకు గురై ఒకరు చనిపోయారని వెల్లడించారు. మృతి చెందిన ఆరుగురు మినహా, తీవ్ర గాయాలు ఎవరికి లేవు. ఇప్పటికీ స్విమ్స్‌లో 29 మందికి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరినీ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స జరుగుతోంది అని వెల్లడించారు. తిరుమలలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటన వెనుక ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Tags:    

Similar News