Ap News: బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

బుడమేరు వరదలతో విజయవాడ కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు...

Update: 2025-01-03 09:24 GMT

దిశ, వెబ్ డెస్క్:బుడమేరు(Budameru) వరదలతో విజయవాడ(Vijayawada)కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala RamaNaidu) అన్నారు. బుడమేరు వరద నియంత్రణపై అధికారులతో ఆయన విజయవాడలో సమీక్ష నిర్వహించారు. బుడమేరు పాత కాల్వ సామర్థ్యంపై చర్చించారు. బుడమేరుకు సమాంతరంగా కొత్త కాల్వ తవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఉప్పుటేరు మార్గాన్ని కూడా వెడల్పు చేయాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 18న మరోసారి భేటీ కావాలని పిలుపునిచ్చారు. ఉప్పుటేరు మార్గం వెడల్పుపై ప్రతిపాదనలు రెడీ చేసి సీఎంకు సమర్పించిన తర్వాత కేంద్రానికి కూడా పంపుతామని మంత్రి నిమ్మల తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం బుడమేరు కార్యచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెను సవాల్ ను ఎదుర్కొంది. విజయవాడ నగరానికి భారీగా వరదలు వచ్చాయి. వర్షం కారణంగా బుడమేరు వాగు పొంగి ఒక్కసారిగా విజయవాడ పలు కాలునీల్లో నీరు ప్రవహించింది. ఈ ప్రవాహంలో మనుషులతో పాటు పలు వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య తక్కువే అయినా ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రభుత్వ సహాయ సహకారాలతో విజయవాడ వాసులు త్వరగా వరదల నుంచి కోలుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం బుడమేరు వాగు వరద నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News