AP:ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 శుక్రవారం నుంచి జూన్ 3 వరకు జరిగాయి. జనరల్ కేటగిరీలో 80 శాతం, వొకేషనల్‌లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్బంగా మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలు జూలై 1వ తేదీ నుంచి వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్ లేదా https://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఏపీ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈనెల 18వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.