తప్పు చేస్తే చర్యలు తప్పవ్: జగన్ పత్రికకు లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత జగన్ పత్రికపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2024-10-18 13:24 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్(YCP chief Jagan) పత్రికపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించిందని, పరువు నష్టం(Defamation) వేశానని, చర్యలు తప్పవని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2019 అక్టోబర్ 22 న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో జగన్ పత్రికలో వచ్చిన కథనంపై విశాఖ కోర్టులో నారా లోకేశ్ పరువు నష్టం దాఖలు చేశారు. తనపై అవస్తవాలు ప్రచురించారని, తద్వారా తనకు పరువు నష్టం జరిగిందని, రూ. 75 కోట్లు చెల్లించాలని దాఖలు చేసి కేసుకు సంబంధించి ఇవాళ (శుక్రవారం) ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పత్రికపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లఘించారో, వాళ్ళపై చర్యలు ఉంటాయన్నారు. దానికి జగన్ ఎందుకు కంగారు పడుతున్నారని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.

‘‘నాపై జగన్ పత్రిక తప్పుడు రాతలు రాసింది. దానిపై పరువు నష్టం దావా వేసా. నేను ఎక్కడికెళ్లినా నేను తాగే కాఫీ, నా డ‌బ్బుల‌తో నేను కొనుక్కున్నదే. ప్రజా కోర్టులో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది. పరువు నష్టం కేసు గెలుస్తామని ఆశిస్తున్నాం. జగన్ మీడియాలోనూ ఎలాంటి మార్పు రాలేదు. తప్పుడు వార్తలు రాస్తున్నారు. సేవ చేసేందుకు ప్రజలు మాకు అవకాశం కల్పించారు. నాపై ఒక్క ఆరోపణను కూడా వైసీపీ నిరూపించలేకపోయింది. నేను ఎక్కడా ప్రజా ధనాన్ని వృథా చేయలేదు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. దుష్ప్రచారం చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.’’ అని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. జగన్ చేసిన లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతుందన్నారు. విచారణ పూర్తవ్వగానే లిక్కర్ స్కాంలో ఉన్న అందరిపై చర్యలు ఉంటాయని లోకేశ్ పేర్కొన్నారు.


Similar News