అది డాక్టర్లు చూస్తారు.. వైఎస్ సునీత వ్యాఖ్యలపై స్పందించిన బొత్స

సీఎం జగన్ ఇంకా ఎన్ని రోజులు ఆ బ్యాండేజ్ ఉంచుతారన్న వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యానారాయణపై స్పందించారు....

Update: 2024-04-26 10:27 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ ఇంకా ఎన్ని రోజులు ఆ బ్యాండేజ్ ఉంచుతారన్న వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యానారాయణపై స్పందించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ బ్యాండేజ్ ఉంచాలా, తీయాలనేది డాక్టర్లు చూస్తారని, ఫోన్ కన్సల్టెన్సీకి, దగ్గరుండి వైద్యం చేసేదానికి చాలా తేడా ఉందన్నారు. అటు వైఎస్ షర్మిలకు సైతం మంత్రి బొత్స సలహా ఇచ్చారు. నిన్నటి వరకూ చెల్లెలు అని, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి నాయకురాలు అని వ్యాఖ్యానించారు. ఇక చెల్లి, అన్న సంబంధాలు ఎక్కడ ఉంటాయని ఎద్దేవా చేశారు. తమపై విమర్శలు చేయడం కాదని.. సమయం పాటించాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్న షర్మిల ఆ పార్టీ ప్రకారం నడుచుకుంటున్నారని బొత్స తెలిపారు.

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి మేలు జరగలేదన్నారు. తామెప్పుడూ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగలేదని మంత్రి బొత్స తెలిపారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే బిల్లుల విషయంలో సపోర్ట్ చేశామని తెలిపారు. ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్ తగ్గిస్తే బీజేపీ కొట్టుకుపోతుందని విమర్శించారు. బీజేపీతో తామెప్పుడూ సంఘర్షణ పడలేదని తెలిపారు. తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

ఇక రాష్ట్రంలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని మంత్రి బొత్స హర్షం వ్యక్తం చేశారు. ఒక్క పొరపాటు జరగ్గకుండా పరీక్షలు నిర్వహించామన్నారు. టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయడం వల్లే పది పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి బొత్స ప్రశంసలు కురిపించారు.

Tags:    

Similar News