హామీలు నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తాం: మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) అన్నారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందించామని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర సంపద సరిపోవడం లేదన్నారు. మత్స్యకారులను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.