‘ఆమె గెలుపు దేశానికి గర్వకారణం’.. హంపి పై మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసలు

న్యూయార్క్‌ వాల్ స్ట్రీట్‌లో ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ (World Rapid Chess) ఛాంపియన్‌షిప్ 2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్(Indian player) తెలుగు తేజం కోనేరు హంపి విజేతగా నిలిచారు

Update: 2024-12-29 09:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: న్యూయార్క్‌ వాల్ స్ట్రీట్‌లో ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ (World Rapid Chess) ఛాంపియన్‌షిప్ 2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్(Indian player) తెలుగు తేజం కోనేరు హంపి విజేతగా నిలిచారు. ఇండోనేషియా(Indonesia)కు చెందిన ఇరిన్ ఖరిష్మా సుకందర్‌ను 11 రౌండ్‌లో ఓడించి మొత్తంగా 8.5 పాయింట్లతో విజయం కైవసం చేసుకున్నారు. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఎక్కువసార్లు టోర్నీలో గెలిచిన జాబితాలో హంపి రెండో స్థానంలో నిలిచారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం సాధించిన కోనేరు హంపిని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అభినందించారు. ఈ మేరకు ఆదివారం పార్టీ కార్యాలయం ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. కోనేరు హంపి(Koneru Humpy) గెలుపు దేశానికి గర్వకారణమన్నారు. రెండోసారి ప్రపంచ టైటిల్‌ను సాధించిన ఆమె ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. మహిళలు హంపిను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

Tags:    

Similar News