‘ఏపీలో మధ్యంతర ఎన్నికలు’..వైసీపీ నేత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఏపీలో ఇటీవల మహిళా అధికారితో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా నేడు(సోమవారం) వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Update: 2024-07-15 06:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల మహిళా అధికారితో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై తాజాగా నేడు(సోమవారం) వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగిన (వైసీపీ) మేమే అధికారంలోకి వస్తాం అన్నారు. నా ప్రతిష్టను దిగజార్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టానని విజసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో నాపై కుట్ర చేస్తున్న ప్రతి వారికి బుద్ధి చెబుతానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ళ తోకలు కత్తిరించడం ఖాయం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో TDP గుండాలు, కార్యకర్తలు ఆకృత్యాలు పెరిగి పోయాయన్నారు.

దాడులు కారణంగా కుటుంబాలకు కుటుంబాలే ఊళ్ళు వదిలి పోతున్నాయి. ఇదే నా ప్రభుత్వం పనితీరు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ పతనం స్టార్ట్ అయిందని వ్యాఖ్యనించారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లడమే ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. నా పరువు తీసేందుకు ప్రయత్నం చేశారో అది మా పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీల వాళ్లైన వదిలి పెట్టేది లేదు...నిన్న మా ఇంటికి ఒక తెలుగుదేశం గుండా వచ్చి విజయసాయిరెడ్డి ఎక్కడ అని అడిగాడట..నేను సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాను. నా ఇంటికి వచ్చి భయపెట్టే తాటాకు చప్పుళ్లకు లొంగేది లేదు అని ఫైర్ అయ్యారు.


Similar News