సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-10-16 07:25 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి ఇదే కేసులో జైల్లో ఉండగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం కేసులో రేపు(17-10-2024, గురువారం) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా 2022 లో వైసీపీ నేతలు భారీ సమూహంతో వచ్చి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యలయంలో చొరబడి బీభత్సం సృష్టించారు. అప్పట్లు ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో తమపై హత్యాయత్నం చేశారని టీడీపీ నేతలు కేసులు పెట్టగా.. వాటిపై తాజాగా విచారణ జరుగుతోంది.

ఇదిలా ఉంటే మంగళవారం వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న ఇమిగ్రేషన్‌ సిబ్బంది సజ్జలను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. తాను ఇప్పుడే విదేశాల నుంచి తిరిగి వచ్చానని, తనకు కనీస సమాచారం లేకుండానే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం ఏమిటంటూ ఈ సందర్భంగా మండిపడ్డ విషయం తెలిసిందే. మరి తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులపై సజ్జల ఏ విధంగా స్పందిస్తారు. విచారణకు హాజరవుతారా లేదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి.


Similar News