మంచు ఫ్యామిలీ పంచాయితీకి బ్రేక్.. షూటింగ్‌కు వెళ్లిన మనోజ్
మంచు ఫ్యామిలీ పంచాయితీకి బ్రేక్ పడింది..
దిశ, వెబ్ డెస్క్: మంచు ఫ్యామిలీ పంచాయితీకి బ్రేక్ పడింది. ఆస్తుల వివాదం, మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఇంటి వద్ద జరిగిన ఘటనపై రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate)లో మంచు మనోజ్(Manchu Manoj), విష్ణుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి గొడవలు చేయొద్దని సూచించారు. అంతేకాదు రూ. లక్ష చొప్పున బాండ్లను తీసుకున్నారు. దీంతో ఈ వివాదంపై మంచు మనోజ్ సైలెంట్ అయ్యారు. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను బుధవారం సాయంత్రమే ఇంటికి పంపివేశారు. గురువారం ఉదయాన్నే మనోజ్ సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఆయన ‘భైరవం’(Bhairavam) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ మల్టీస్టారర్‌గా రూపొందుతోంది. నటులు మనోజ్‌తో పాటు నారా రోహిత్(Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) నటిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి క్రిస్మస్ బరిలో నిలవాలని ఆశించారు. కానీ నారా రోహిత్‌కు పితృవియోగం, మంచు మనోజ్ ఆస్తుల వివాదం వల్ల షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వివాదాలను పక్కన పెట్టి భైరవం మూవీ షూటింగ్‌పై మంచు మనోజ్ దృష్టి సారించారు. ఈ మేరకు షూటింగ్ కార్యక్రమాలకు అందుబాటులో ఉండనున్నారు.