Vijayawada: వైభవంగా దుర్గమ్మ గుడి ఆషాడ ఉత్సవాలు... 16 వరకూ వారాహి నవరాత్రులు

దుర్గమ్మ గుడి ఆషాడ ఉత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి...

Update: 2024-07-06 02:06 GMT

దిశ, వెబ్ డెస్క్: దుర్గమ్మ గుడి ఆషాడ ఉత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఆషాడ మాసం సందర్భంగా నేటి నుంచి వారాహి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 16 వరకూ వారాహి నవరాత్రులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలతో పాటు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు సైతం చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయం దూప దీపాలతో వెలిగిపోతోంది. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అలాగే జులై 19 నుంచి 21 వరకూ శాకాంబరి దేవి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల్లో దుర్గమ్మను, ఆలయాన్ని ఆకుకూరలు, కాయగూరలూ, వివిధ రకాల ఎండు ఫలాలతో అందంగా అలంకరిస్తారు. అలా వినియోగించిన కూరగాయల తర్వాత భక్తులకు కదంబ ప్రసాదంగా వితరణ చేయనున్నారు.


Similar News