Deputy Commissioner of Excise:ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలి

ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి పేర్కొన్నారు.

Update: 2024-10-17 13:36 GMT

దిశ, నందికొట్కూరు: ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి పేర్కొన్నారు. నందికొట్కూరు స్టేషన్ గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీదేవి మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం షాపులు అన్ని ప్రారంభించాలి. మద్యం అమ్మకం దారులు సమయపాలన పాటించాలని, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని, నూతన మద్యం షాపులు గుడి, బడి, చర్చి మసీదు వీటికి 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని, కొత్త వ్యాపారస్తులు నిబంధనల మేరకు నడుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. అలాగే నాటు సారా మీద కఠిన చర్యలు తీసుకోవాలని, నాటు సారా తయారీకి ప్రధాన వనరు అయినటువంటి బెల్లంను సప్లై చేసే వారిని మీద నిఘా ఉంచాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ప్రస్తుతం ఉన్న కండిషన్ చూసి, స్టేషన్ రిపేర్ కొరకు నివేదిక సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సీఐ రామాంజనేయులు, ఎస్.ఐ జఫరుల్లా పాల్గొన్నారు.


Similar News