పైకి రేకుల షెడ్డు.. లోపల చూస్తే షాకే..!

ఏపీలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు విచిత్రమైన తెలివితేటలు ప్రయోగిస్తున్నారు...

Update: 2024-04-18 14:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఓటర్లకు నగదు, చీరలు, మద్యం, గిఫ్టులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు కొనసాగుతూ కొందరు నేతలు మాత్రం యదేచ్ఛగా ఉల్లంఘిస్తు్న్నారు. ఎన్నికల సంఘం కళ్లు గప్పి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిన్న సమాచారం అందినా రైడ్స్ చేస్తున్నారు. నగదు, బంగారం, వెండి, చీరలు, గిప్టులు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.


అటు చిత్తూరు జిల్లాలోనూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. రేకుల షెడ్డులో మద్యం నిల్వలున్నాయని సమాచారం అందడంతో సోదాలు చేశారు. దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. 100కు పైగాకు పైగా మద్యం కేసులు నిల్వ ఉన్నాయి. ఈ రేకుల షెడ్డు ఎవరిదని ఆరా తీయంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు షాక్ గురయ్యారు. సాక్షాత్తు చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డికు చెందిన రేకుల షెడ్డుగా గుర్తించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు నిల్వ ఉంచినట్లు నిర్ధారణ అయింది. దీంతో మద్యాన్ని సీజ్ చేశారు. 


Similar News