Food Poison: 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవేడ ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది....
దిశ, కర్నూలు ప్రతినిధి: నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవేడ ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 44 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో పప్పు, బెండకాయ, ఇతర వంటకాలతో విద్యార్థినులకు మెనూ వంటకాలు చేశారు. ఆహారం తిన్న తర్వాత ఒక్కొక్కరుగా విద్యార్థినులు వాంతులు చేసుకోవడం, కడుపు నొప్పి రావడంతో ఆందోళనకు గురయ్యారు. గమనించిన అక్కడి సిబ్బంది విద్యార్థినులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. భోజనానికి ముందు నిల్వ చేసిన మరమరాలు పెట్టడంతోనే తమకు వాంతులు, కడుపు నొప్పి వచ్చిందని విద్యార్థినిలు వాపోయారు.