Kurnool: టిడ్కో గృహాల సమస్యలపై మంత్రి బుగ్గన కీలక ఆదేశాలు

టిడ్కో గృహ నివాసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఎలాంటి సమస్యల్లేకుండా చూడాలని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ...

Update: 2023-11-07 16:54 GMT

దిశ, ప్రతినిధి కర్నూలు: టిడ్కో గృహ నివాసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఎలాంటి సమస్యల్లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం సమావేశపు హాలులో కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గ స్థాయి అభివృద్ధి, సంక్షేమంపై ఎమ్మెల్యేలు, జిల్లా, డివిజన్, మండల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారికోసం రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే టిడ్కో గృహాల వద్ద ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఇళ్లు చూడడానికి వచ్చినపుడు ఏ బ్లాక్ ‌లో ఏ ఇళ్లు తదితర వివరాలు తెలియజేయాలన్నారు. ఎమ్మిగనూరులో టిడ్కోలో ఇళ్ల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. టీవీ 9 కాలనీకి సంబంధించి 2009 వరదల సమయంలో 1250 ఇళ్లు ఇచ్చారని తెలిపారు. అయితే అక్కడ లబ్ధిదారులు ఉండకపోవడంతో వేరే వాళ్లు ఉంటున్నారని, ఇప్పుడు సంబంధిత లబ్ధిదారులు తమ ఇళ్లు తమకు కేటాయించాలని అర్జీలు సమర్పిస్తున్నారని కోడుమూరు ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. 

Tags:    

Similar News