రాయితీపై బిందు సేద్యం పరికరాలు.. ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ

రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేయనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2023-05-27 15:06 GMT

దిశ, నంద్యాల : రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేయనున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 2023-24 సంవత్సరానికి గాను 5 వేల హెక్టర్లను లక్ష్యంగా కేటాయించామని, అవసరమైన ప్రతి రైతుకు కూడా రాయితీపై ఈ పరికరాలు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వారి పేర్లను నమోదు చేసుకోవాలని, ఐదెరాల్లోపు ఉంటే 90 శాతం రాయితీ, ఐదెకరాలపైన ఉన్న రైతులకు 70 శాతం రాయతీపై బిందు సేద్యం పరికరాలు అందచేయనున్నట్లు తెలిపారు.

స్ప్రింకర్ పరికరాలు ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు 55శాతం అంతకంటే పైన వున్న రైతులకు 45 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. జిల్లాకు 11 కంపెనీలను కేటాయించారని, రైతులు వారికి నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News