IRR Case: నారా లోకేశ్‌‌‌ వదలని సీఐడీ.. విచారణకు మళ్లీ రావాలని ఆదేశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పు కేసులో సీఐడీ అధికారులు విచారించారు. ...

Update: 2023-10-10 12:59 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పు కేసులో సీఐడీ అధికారులు విచారించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రశ్నించారు. నారా లోకేశ్‌ను మొత్తం 49 ప్రశ్నలు అడిగారు. అయితే బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని సూచించారు. ఇందుకు తాను ఏ తప్పు చేయలేదని.. ఎన్నిసారైనా విచారణకు వస్తానని లోకేశ్ బదిలిచ్చారు.

విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధంలేని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడిగారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు తనకు చూపించలేదని చెప్పారు. తన కుటుంబ సభ్యులు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఎలాంటి లాభం జరిగిందో చెప్పలేదని నారా లోకేశ్ తెలిపారు.

Tags:    

Similar News