Breaking: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ... పీటీ వారెంట్‌పై విచారణకు అనుమతి

ఫైబర్‌నెట్ కేసులో పీటీ వారంట్‌పై చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది...

Update: 2023-10-12 10:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ఎదురుదెబ్బ తగిలింది. పీటీ వారంట్‌పై ఆయనను విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని జడ్జి సూచించారు.

కాగా ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరఫు లాయర్ వివేకానంద సుదీర్ఘంగా వాదించారు. కేసు వివరాలు, ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలను ధర్మాసనానికి వివరించారు. చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని వాదనలు వినిపించారు. దీంతో పీటీ వారంట్‌పై వాదనలు కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు సమ్మతించింది. ఈ మేరకు చంద్రబాబును సోమవారం కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.

Tags:    

Similar News