గేదెను ఢీకొని పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్

కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

Update: 2024-12-28 09:24 GMT

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కానూరు సిద్ధార్థ కాలేజ్(Kannur Siddhartha College) వద్ద గేదె(Buffalo)ను ఢీకొని కారు(Car) పల్టీలు కొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న డ్రైన్‌లో దూసుకెళ్లింది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే కారు డ్రైవర్ ఓనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కారును డ్రైన్‌లో నుంచి రోడ్డుపై తీసుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అయితే కారు డ్రైవర్ కూడా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కేస్తున్నారు.

Tags:    

Similar News