కోడికత్తి కేసు: జగన్ వల్లే విచారణ ఆలస్యం.. మానవత్వంతో ఆలోచించాలన్న న్యాయవాది సలీం
వైఎస్ జగన్‌పై కోడికత్తి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగన్‌పై కోడికత్తి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు శ్రీనివాసరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తమ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని హైకోర్టును ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు కోరారు. ఎన్ఐఏ విజ్ఞప్తిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి విచారణను వాయిదా వేసేందుకు అంగీకారం తెలిపింది. అయితే విచారణను ఎప్పటి వరకు వాయిదా వేయాలో చెప్పాలని ఎన్ఐఏ, నిందితుడి తరపు లాయర్లను న్యాయమూర్తి అడిగారు. అయితే డిసెంబర్ 1 వరకు విచారణను వాయిదా వేయాలని ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఈ విజ్ఞప్తిపై తి అడిగారు. డిసెంబర్ 1 వరకు వాయిదా వేయాలని ఎన్ఐఏ లాయర్లు సూచించగా అందుకు నిందితుడు శ్రీనివాస్ తరపు లాయర్లు అభ్యతరం వ్యక్తం చేశారు. దీంతో మధ్యేమార్గంగా ఈనెల 23కి వాయిదా వేసింది.
జగన్ వల్లే ఆలస్యం
కోడికత్తి కేసులో విచారణ వాయిదా అనంతరం కోర్టు బయట నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ తరఫు న్యాయవాదులు మాత్రం వాదనలు వినిపించేందుకు సిద్ధంగా లేమని న్యాయస్థానానికి తెలిపారని అన్నారు. అయితే తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా వేయాలని న్యాయమూర్తిని కోరగా అందుకు అంగీకరించారని న్యాయవాది సలీం వెల్లడించారు. మరోవైపు ఈ కోడికత్తి కేసు విచారణ ఇప్పటికే 80శాతం దర్యాప్తు పూర్తైనట్లు సలీం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉందని.. కానీ సంవత్సర కాలంగా ఆయనను కోర్టుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ కోర్టుకు రాకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఈ కేసును సాగదీసే యత్నం చేస్తున్నారని న్యాయవాది సలీం తెలిపారు. శ్రీనివాసరావు కుటుంబం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో కూలి పనులు చేసుకునే నిరుపేదలని వెల్లడించారు. కాబట్టి సీఎం వైఎస్ జగన్, ఎన్ఐఏ సంస్థలు మానవత్వంతో ఆలోచించి ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్న శ్రీనివాసరావును విడుదలకు సహకరించాలని న్యాయవాది సలీం కోరారు.