Ap News:కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీకి రిమాండ్!
మాజీ మంత్రి, వైసీపీ నేత(YCP Leader) కొడాలి నాని(Former Minister Kodali Nani) ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా(krishna District) వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని గుడివాడ పోలీసులు(Gudivada Police) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత(YCP Leader) కొడాలి నాని(Former Minister Kodali Nani) ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా(krishna District) వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని గుడివాడ పోలీసులు(Gudivada Police) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో గుడివాడ టీడీపీ కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావు పై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో తాజాగా కాళీకి న్యాయస్థానం రిమాండ్ విధించింది. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి(Govt Hospital)లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను గుడివాడ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జనవరి 10వ తేదీ వరకు కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత నిందితుడు కాళీని పోలీసులు నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.