Breaking: సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో బిగ్ ట్విస్ట్
సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల షూరిటీతో కండీషనల్ బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. శని, ఆదివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌పై విజయవాడలో రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సతీష్‌తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి.. తాజాగా ఇవాళ వెలువరించింది. కాగా, సీఎం జగన్ రాళ్ల దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న సతీష్‌కు బెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు సంవత్సరాలు తరబడి బెయిల్ లభించకపోగా.. సతీష్‌కు మాత్రం వెంటనే బెయిల్ దక్కవడం గమనార్హం.