Breaking: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు..

Update: 2024-08-28 11:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానాన్ని రద్దు ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. ఈ విధానంలో చాలా అవకతవకాలు జరిగాయని, సొంతవారికే కాంట్రాక్టులు ఇచ్చుకున్నారనే ఆరోపణలు రావడంతో మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించిన మంత్రులు పోలవరం ఎడమ కాలువ పూర్తి చేసి ఆ ప్రాంతానికి నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 1,286 కోట్లు విడుదల చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖలో భాగమైన సెబ్‌ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 22ఏ భూముల వివాదాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని,  వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు.  భూముల సర్వే రాళ్లు, రైతుల పాస్ పుస్తకాలపై గత ప్రభుత్వం అప్పటి సీఎం బొమ్మలను వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు వాటన్నింటిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ చిహ్నంతో కొత్తగా 21.86 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సర్వే రాళ్లపై జగన్ బొమ్మలను తొలగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 2774 కొత్త రేషన్ షాపుల ఏర్పాటు  చేయడంతో పాటు వాటిల్లో ఈపీఓఎస్ మెషీన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇందుకు రూ.11.50 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్యం వల్ల ప్రాజెక్టుల్లో దెబ్బతిన్న నిర్మాణాల రిపేర్‌కు నిధులు విడుదల చేసేందుకు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

Tags:    

Similar News