Deputy CM Pawan:సామాజిక స్పృహ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

గుంటూరులో నేడు(ఆదివారం) జరిగిన అరణ్యభవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ(Forest Martyrs Remembrance House) నిర్వహించారు.

Update: 2024-11-10 10:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరులో నేడు(ఆదివారం) జరిగిన అరణ్యభవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ(Forest Martyrs Remembrance House) నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalan) అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మార్పుతోనే ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగుతాయని చెప్పారు. ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు ఆగాలంటే మొదట మనందరికీ సామాజిక స్పృహ ఉండాలి. అన్యాయం జరిగితే ఆపాలన్న ఆలోచన సమాజానికి ఉండాలి అని తెలిపారు. కళ్ల ముందు ఆడబిడ్డలను ఏడిపిస్తుంటే చోద్యం చూస్తూ ఉంటారు. ముందుగా ప్రజలు కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ఈ క్రమంలో ‘నా కళ్ల ముందు ఏ ఆడబిడ్డకు ఇబ్బంది కలిగినా చూస్తూ ఊరుకోను. పోలీసులు కూడా.. ఫిర్యాదు చేసిన వారిని క్రిమినల్స్ గా పరిగణించవద్దు. ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు పెట్టడానికి వెళ్తే అధికారులు సరిగా స్పందించలేదు. ఆ కేసులో తమ బిడ్డ బ్రెయిన్ డెడ్ అయితే అతని తల్లి అవయవాలు దానం చేయడం నన్ను కదిలించింది. ఇలాంటి సమయంలో ప్రాణాలు తీసుకురాలేకపోయినా, మన ప్రవర్తన ఓదార్పునివ్వాలి. ప్రజలు కూడా నేరం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు మనల్ని ఇబ్బంది పెడతారు అన్న ఆలోచనల నుంచి బయటకు రావాలి. పది మంది వెళ్లి ఫిర్యాదు చేస్తే అలాంటి పరిస్థితులను నిలువరించవచ్చు’ అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

Tags:    

Similar News