AP News:త్వరలోనే నూతన టెక్స్ టైల్స్ పాలసీ.. మంత్రి కీలక ప్రకటన
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి సవిత(Minister Savita) సమాధానాలు ఇచ్చారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మంత్రి సవిత(Minister Savita) సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె ప్రసంగిస్తూ.. 2015 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా చేనేతలకు ఆసరాగా ఉండేలా ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు 90 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తర్వాత జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల మాదిరిగా చేనేత రంగం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిందని మంత్రి సవిత అన్నారు. పేదల ఇళ్ల పేరుతో ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్కులో 14 ఎకరాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నిర్ణయంపై మేం కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి.. టెక్స్ టైల్స్ పార్కు భూములు కాపాడాం.
గత(2014-19) చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మిగనూరులో కచ్చితంగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేయబోతున్నాం మంత్రి సవిత ప్రకటించారు. ఈ క్రమంలో 5 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో.. దూరదృష్టితో 2014-19లో రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్ టైల్స్ పార్కులు నిర్ణయించాలని సీఎం చంద్రబాబు అప్పట్లో నిర్ణయించారు. తర్వాత వచ్చిన జగన్ వాటిని అభివృద్ధి చేయకపోగా, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరే అభివృద్ధి పనులు చేపట్టలేదని మండిపడ్డారు.