AP Govt.: పెన్షన్‌దారులకు బిగ్ అలర్ట్.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ (Distribution of Pensions)పై నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

Update: 2024-11-21 12:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ (Distribution of Pensions)పై నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది. ఈ మేరకు పింఛన్‌దారులు వరుసగా 2 నెలలు పాటు ఏవైనా కారణాలతో పింఛన్లు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం పింఛన్ పంపిణీ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరైనా మూడు నెలల పాటు పింఛన్ తీసుకోని పక్షంలో శాశ్వతంగా వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి పింఛన్‌ను నిలిపి వేయనున్నారు. ఈ నెల నుంచే నూతన మర్గదర్శకాలు అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.  

Tags:    

Similar News