Kethireddy : పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన కేతిరెడ్డి

ఏపీలో విపక్ష వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు పార్టీని వీడారు.

Update: 2024-09-20 04:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో విపక్ష వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు పార్టీని వీడారు. మరికొందరు వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) రాజీనామా చేయగా.. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udayabhanu) వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి బాటలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి(Kethireddy) వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు విస్తృతమయ్యాయి. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై.. పార్టీ మార్పుపై చర్చించినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా.. ఈ వార్తలపై కేతిరెడ్డి స్పందించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్‌ వెంటే ఉంటా అని స్పష్టం చేశారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని కేతిరెడ్డి అన్నారు.


Similar News