Kadapa: యువతిపై ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమను అంగీరించలేదని కత్తితో దాడి
తన ప్రేమను అంగీకరించడం లేదని యువతిపై ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు.
దిశ, వెబ్ డెస్క్: తన ప్రేమను అంగీకరించడం లేదని యువతిపై ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా(Kadapa District) వేముల కొత్తపల్లి(Vemula Kothapalli) గ్రామంలో జరిగింది. ఘటన ప్రకారం షర్మిల(Sharmila) అనే యువతిపై కుళ్లాయప్ప(Kullayappa) అనే యువకుడు కత్తితో దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఎవరు లేనిది చూసి, యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి కత్తితో దారుణంగా పొడిచాడు. ఇంట్లో విగత జీవిగా పడి ఉన్న యువతిని చూసిన కుటుంబ సభ్యులు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు బాధితురాలిపై 11 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. యువకుడు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే కుళ్లాయప్ప, షర్మిలను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, తన ప్రేమను అంగీకరించనందుకే ఈ దాడికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.