మణిపూర్ ఘటనను ఖండిస్తూ జర్నలిస్టుల శాంతి ర్యాలీ

దేశంలో ఏరోజు లేనివిధంగా దళితులు,ముస్లిం మైనారిటీ వర్గాలపై దాడులు పెచ్చు మీరి పోయాయని,ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు టీవీ 8 ఎండీ నారాయణం సాయి, కొండ్రు కిరణ్ లు ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2023-07-25 15:59 GMT

దిశ, చీరాల : దేశంలో ఏరోజు లేనివిధంగా దళితులు,ముస్లిం మైనారిటీ వర్గాలపై దాడులు పెచ్చు మీరి పోయాయని,ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు టీవీ 8 ఎండీ నారాయణం సాయి, కొండ్రు కిరణ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సంఘటనలో అరాచకశక్తులు చేస్తున్న దుర్మార్గాలను ఖండిస్తూ, వాటి ని ప్రోత్సహిస్తున్న అరాచక శక్తులను తుదముట్టించాలని కోరుతూ చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు.

మణిపూ ర్ రాష్ట్రంలో దళితులు ముస్లిం లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. నిరసన ప్రదర్శన, శాంతియుత ర్యాలీలో ఎలక్ట్రా నిక్ అండ్ ప్రింట్ మీడియా విలేఖరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News