Janhvi Kapoor: శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇవాళ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.

Update: 2025-01-04 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇవాళ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమల చేరుకున్న ఆమె శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొ్న్నారు. ఈ మేరకు ఆమెకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తయిన వెంటనే రంగనాయకుల మండప ఆవరణలో జాన్వీ కపూర్‌కు ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.    


Similar News