Breaking: అంబటిపై జనసైనికుల కవిత అదుర్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ప్రత్యర్ధులు ఎప్పుడు ఇలా దొరుకుతారా.. ఎలా విమర్శిద్దామా అని నేతలు కాచుకు కూర్చుంటున్నారు. ఎలాంటి అవకాశం దొరకని నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల్లో చోటు చేసుకునే ప్రతి విషయాన్నితమకు అనుకూలంగా మలచుకుని భూతద్దంలో చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ప్రతి పార్టీ నాయకులు మీడియాను ప్రధాన వేదికగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో యమహుషారుగా ఉంటున్నారు.
ప్రతిపక్షాలకు సంబంధించి చిన్న విషయం బయటకి వచ్చినా చాలు.. ఆ అంశం ఏదైనా తనకు అనుకూలంగా మలచుకుని ప్రతిపక్షాలపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా టీడీపీ, జనసేన అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశిస్తూ ఓ ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ద్వారా తన సీటేదో ? తానే డిసైడ్ చేసుకోలేనోడు.. జనానికి, జనసైనికులకి ఏమి చేస్తాడని ప్రశ్నించారు.
కాగా ఈ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అంబటి పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమాని అయినా ఓ వ్యక్తి అంబటి పోస్ట్ పై సంపాదిస్తూ ఎద్దేవ కామెంట్ చేశారు. ఆ కామెంట్ లో.. నీ సీట్ ఏదో నీకు తెలియదు మళ్లీ నువ్వు నీరు పారుదల మంత్రివి.. జనాలని ఆదుకుంటావ్ అని గెలిపిస్తే సంక్రాంతి రోజు గంగిరెద్దు లాగా డాన్స్ వేస్తుంటివి.. సంక్రాంతి సంబరాలు అని పెట్టి జనాల దగ్గర నుంచి వసూలు మొదల పెడితివి అంటూ కవితల రాసుకువచ్చారు.