కల్తీ నెయ్యి వివాదం వేళ జనసేన నేత నాగబాబు కీలక డిమాండ్
తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై జనసేన(Janasena) నేత కొణిదెల నాగబాబు(Nagababu) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై జనసేన(Janasena) నేత కొణిదెల నాగబాబు(Nagababu) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూపై చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. కల్తీ కారకులంతా బయటకొస్తారు.. చట్ట ప్రకారం అందరికీ శిక్షపడుతుందని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మంపై హిందువులు పరస్పరం అవమానించుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. డిక్లరేషన్‌పై ఒక్కటే మాట.. అన్ని మతాలను అందరూ గౌరవించాలని అన్నారు.
జాతీయ స్థాయిలో హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నాగబాబు డిమాండ్ చేశారు. మరోవైపు లడ్డూ కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చిన తీరుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ జరిపింది. సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిన విధానంపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలిపారు. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసింది.