Janasena: మంచి మనసు చాటుకున్న నిహారిక .. 10 గ్రామాలకు ఆర్థిక సాయం
నాగబాబు కూతురు నిహారిక మంచి మనసు చాటుకున్నారు..
దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం జవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) స్ఫూర్తితో నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక(Nagababu daughter Konidela Niharika) ఏపీలో 10 గ్రామాలకు రూ. 5 లక్షల మద్దతు సాయం అందజేశారు. పిఠాపురం నియోజకవర్గం పి.గన్నవరం మండలం జీ పెద్దపూడి, ఉడిమూడి, పెద్దపట్నం, నాగులంక, ఎల్ గన్నవరం, మామిడికుదురు మండలం పాసర్లపూడి, పాసర్లపూడిలంక, అప్పన్నపల్లి, పెద్దపట్నం, పెద్దపట్నంలంక గ్రామాలకు ఒక్కో గ్రామ పంచాయతీకి ఆమె రూ. 50 వేల మద్దతు సాయం ప్రకటించారు. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గం చెబ్రోలు పార్టీ కార్యాయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామా సర్పంచ్లకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో, గ్రామా అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ పాటు పడుతున్నారని తెలిపారు. ఆయన బాటలోనే నడవాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు కూడా తోచిన రీతిలో సహాయం అందిస్తున్నారని చెప్పారు. నిహారిక ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేయాలని పవన్ కల్యాణ్ సూచించారని తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు నాగబాబు పేర్కొన్నారు.
Read More...
Pawan Kalyan: మేడారం జాతర, బతుకమ్మ పండుగపై కీలక వ్యాఖ్యలు