Pawan Kalyan: మేడారం జాతర, బతుకమ్మ పండుగపై కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-17 13:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బల్లార్‌పూర్‌(Ballarpur)లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశమని.. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని అన్నారు. మన బతుకమ్మ(Bathukamma Festival), మన సమ్మక్క సారక్క జాతర(Medaram Jatara) ఇక్కడ ఈ నేలపై జరుగుతుందని తెలిపారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారని ఆవేదన చెందారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మం(Sanatana Dharma)పై దాడి జరిగితే తాను కచ్చితంగా బయటకు వస్తాను, పొరాడుతాను అని ప్రకటించారు.

జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉందని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలసాహెబ్ ఠాక్రే ఈ ఇద్దరి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్నామని అన్నారు. ఇది దేశ ప్రజల అదృష్టం అని చెప్పారు. ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయని అన్నారు. శివసేన - జనసేన రెండు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేసేవే అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ లేని భారతదేశాన్ని ఊహించుకోగలమా? ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకపోయి ఉంటే దేశం ఇంత బలంగా ఉండేదా? అని అన్నారు.

Tags:    

Similar News