మాట ఇస్తున్నా.. మత వివక్ష చూపను: Pawan Kalyan

ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ...

Update: 2023-12-14 13:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి మైనార్టీ నేత మహ్మదర్ సాధిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మత వివక్షను చూపనని ముస్లింలకు హామీ ఇచ్చారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే తొటి మనిషిగా అండగా నిలబడతానని చెప్పారు. కులం, మతాన్ని వచ్చానని చెప్పారు. మానవత్వాన్ని నమ్మానని.. అన్ని రాజకీయ పక్షాలను చూశానని.. ఒక్కసారి జనసేనను నమ్మాలని పిలుపునిచ్చారు. మాట ఇస్తే అసలు వెనక్కి తగ్గనని, అన్ని ఆలోచించిన తర్వాతే మాట ఇస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.

ప్రస్తుతం ఏపీకి దిక్కులేకుండా పోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గనులు తవ్వుకుని వెళ్లిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా అభివృద్ధికి నేతలు కృషి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఆగాలంటే వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News