టీడీపీ నుంచి బయటకు జనసేన .. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ, జనసేన పొత్తులపై జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ మేరకు పొత్తులో భాగంగా అభ్యర్థులను సైతం అధినేతలు ప్రకటించారు. 118 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా అందులో 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. 5 సీట్లలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అయితే టీడీపీ, జనసేన పొత్తులపై జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు నుంచి జనసేన బయటకు రావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు బీజేపీతో కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలు వెళ్లచ్చేమోనని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అప్పటికప్పుడు ఏమైనా జరగొచ్చని జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను టీడీపీ, జనసేన శ్రేణులు ఖండించారు. జనసేన తరపున గతంలో జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ మనస్థత్వం గురించి తెలిసి కూడా జేడీ లక్ష్మీనారాయణ అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.