ఏపీ పరువును జగన్ రోడ్డున పడేశారు..కేసీఆర్ వ్యాఖ్యలపై నోరువిప్పండి: దేవినేని ఉమా
ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల దుస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల దుస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం పరువును రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘నాలుగున్నర ఏళ్ళుగా రోడ్లగురించి పట్టించుకోలేదు. జగన్ రెడ్డి పాలనపై పక్క రాష్ట్రాల్లో మంత్రుల హేళన. రాష్ట్రం పరువు రోడ్డున పడేశారు. ప్రజల అవస్థలు పట్టించుకోరు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి. ఏపీలో రోడ్లదుస్థితి గురించి పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ నోరువిప్పాలి’ అని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల వీడియోలను ట్విటర్ వేదికగా దేవినేని ఉమా మహేశ్వరరావు షేర్ చేశారు.