‘జగన్ అసెంబ్లీకి వెళ్లాలి.. అధికార పక్షం నిర్ణయాలను ప్రశ్నించాలి’.. సీపీఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో రేపటి(సోమవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపటి(సోమవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రకటన పై సీపీఐ రామకృష్ణ స్పందించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్(YS Jagan)ను అసెంబ్లీ సమావేశాల(Assembly meetings)కు హాజరు కావాలని సీపీఐ రామకృష్ణ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టుల తరఫున ఎవరు ప్రతినిధులు లేకపోవడంతో అధికార పార్టీని ప్రశ్నించే వారే లేరన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా అధికార పక్షంలో ఉన్నారన్నారు. వైసీపీ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల తరఫున అధికార పార్టీని ప్రశ్నించాలని ఆయన పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు, మహిళలపై విమర్శలు ఎక్కువైపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలంటే వైఎస్ జగన్ తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరై ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సీపీఐ రామకృష్ణ కోరారు.