Pawan Kalyan:ఎస్పీకి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఆలమూరు మండలం మడికి చెందిన శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి,10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు
దిశ ప్రతినిధి,గోదావరి: రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఆలమూరు మండలం మడికి చెందిన శ్రీనివాసరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి,10వ తరగతి చదువుతున్న తన కుమార్తె వెన్నెల ఆత్మహత్య చేసుకుందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వెన్నెల స్కూల్ యాజమాన్యం ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. రాజమండ్రిలో పవన్ కాన్వాయ్‌ను ఆలమూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వెన్నెల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పర్యటన అనంతరం ఈ సమస్య పై మాట్లాడతానని పవన్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు కోనసీమ ఎస్పీ కృష్ణారావుతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు.