కడుపైనా చేయాలి..ముద్దైనా పెట్టాలన్న బాలకృష్ణను ఓడించండి: ఎంపీ గోరంట్ల మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం హీటెక్కింది.

Update: 2023-11-16 08:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం హీటెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే,అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ మీద ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమ్మాయి కనబడితే చాలు కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అంటూ వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణను ఓడించాలి అని గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తికి ఎవరు ఓటు వేయోద్దని కోరారు. బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల మాధవ్ హిందూపురం నియోజకవర్గంలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గోరంట్ల మాధవ్ వీడియో సంగతేంటి అని నిలదీశారు.

ఓటర్లను తన్నడం తెలుసు

నందమూరి బాలకృష్ణను నమ్మి హిందూపురం ప్రజలు అసెంబ్లీ స్థానానికి గెలిపిస్తే.. ఆయనేమో మూడు ఘనకార్యాలు వెలగబెట్టారంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బాలకృష్ణ రాత్రి అయితే ఫుల్ బాటిల్ ఎత్తడం.. తెల్లారితే ఓటర్లను తన్నడం ఇవే తెలుసునంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తనకు హిట్ సినిమా ఇచ్చిన నిర్మాత మీదే కాల్పులకి పాల్పడిన ఘనుడు బాలకృష్ణ అని ఆరోపించారు. అంతేకాదు మహిళలు పూజింపబడాలని, గౌరవించబడాలని వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తే.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ మాత్రం.. అమ్మాయి కనబడితే చాలు కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అంటూ అతి దారుణంగా మాట్లాడుతుంటారు అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News