గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐదో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(Grandhi Srinivas) నివాసాల్లో ఐదో రోజు ఐటీ సోదాలు(IT Searches) కొనసాగుతున్నాయి.

Update: 2024-11-10 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్: భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(Grandhi Srinivas) నివాసాల్లో ఐదో రోజు ఐటీ సోదాలు(IT Searches) కొనసాగుతున్నాయి. భీమవరంలో ఏడు చోట్ల సోదాలు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ అనుచరుల ఇళ్ళలో కూడా అధికారుల సోదాలు చేపట్టారు. నిన్నటి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్‌ నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజనా జాని.. కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మణరావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వీటితో పాటుగా ప్రకాశం జిల్లాలోని రొయ్యల ఫ్యాక్టరీ లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.


Similar News