Breaking: ఏపీలో ఉదయం నుంచే భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎడతెరిపిలేని వాన
ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీగా వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ఇప్పటికే పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.