AP Politics:ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆయనేనా?
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అనకాపల్లి టీడీపీ నేత పీలా గోవింద్‌తో పాటు పెందుర్తి నేత గండి బాబ్జీ కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బొత్సను ఢీ కొట్టగలిగిన అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ నెల 30వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా ..ఆగస్టు 13 లోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంది.