పొత్తు కుదిరిన వేళ కీలక పరిణామం.. ఏపీకి ప్రధాని... ఆ సభకు వస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన వేళ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ...

Update: 2024-03-09 12:34 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన వేళ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికలకు ముందు ఏపీలోప్రధాని మోదీ రాకను వ్యతిరేకించిన టీడీపీ.. తాజాగా తమ సభకు రావాలని ఆహ్వానించింది. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబునే వెల్లడించారు. బీజేపీతో పొత్తులు కుదిరిన వేళ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తు అవసరాలను పార్టీ నేతలకు వివరించారు. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ సీట్లు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి నడవనున్నాయని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఇక సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీజేపీ, జనసేన సీట్లను మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, కూటమి విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News