అల్లు అర్జున్‌పై మరోసారి జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

Update: 2024-08-28 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ లేరని.. ఉన్నదంతా మెగా ఫ్యాన్సేనని ఎమ్మెల్యే చేసిన కామెంట్లు.. సోషల్ మీడియాలో మెగా, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్వీట్ల వార్‌కు దారి తీసింది. ఇదిలా ఉండగా.. బొలిశెట్టి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌తో ఎలాంటి శత్రుత్వం, గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం బన్నీపై తాను ఎలాంటి కామెంట్లు చేయబోను.. మొన్న కూడా ఆయన ఇటీవల చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. దీనిపై బన్నీ మాట్లాడితే తాను కూడా ఏమాత్రం అనుమానం లేకుండా మాట్లాడతాను అని అన్నారు.

కాగా, ‘అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్లు నాకు తెలియదు. ఉన్నది ఒక్కటే మెగా ఫ్యాన్స్. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా బ్రాంచ్‌లాగా షామియానా, టెంట్లు వేసుకుంటే తెలియదు కానీ.. ఉన్నది మాత్రం మెగా(చిరంజీవి) ఫ్యాన్స్ ఒక్కటే. అంతే తప్ప అల్లు అర్జున్‌కు అభిమానులు ఉన్నారని నాకు తెలియదు. ఫ్యాన్స్ ఉన్నట్లు అల్లు అర్జున్ ఊహించుకుంటున్నాడేమో. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. తమకు బన్నీ సపోర్ట్ చేసినా చేయకపోయినా నష్టం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయారు. అది గుర్తుంచుకోవాలి. గతంలో ఎంపీగా పోటీ చేస్తే అల్లు అరవింద్‌ను కూడా బన్నీ గెలిపించుకోలేకపోయావు’ అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News