Breaking: తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు

తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 (Section30) పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు...

Update: 2024-09-26 13:25 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా (Tirupati District) వ్యాప్తంగా సెక్షన్ 30 (Section30) పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు (SP Subbarayudu) ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వచ్చే నేల 24వ తేదీ వరకు ఈ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని.. కాదని కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు బాధ్యులవుతారని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు.


తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy) కొనసాగుతున్న విషయం తెలిసిందే. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావడంతో శ్రీవారి భక్తులు(Srivari Devotees), హిందువులు(Hindus), రాజకీయ నాయకులు(Politicians) మండిపడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని, నెయ్యిలో జంతువుల అవశేషాలు వినియోగించారని కూటమి నాయకులు మండిపడ్డారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సైతం తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేశ్వరస్వామి(Venkateswara Swamy)ని క్షమించమంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీంతో వైసీపీ అధినేత జగన్(YCP Chief Jagan) సైతం ప్రాయశ్చిత దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తిరుపతిలో దీక్ష చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు జగన్ దీక్షకు పలువురు స్వామీజీలు, భక్తులు వ్యతిరేకిస్తు్న్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 


Similar News