YS Sharmila:ప్రభాస్‌తో రిలేషన్‌పై స్పందించిన షర్మిల.. పిల్లల మీద ప్రమాణం చేసి షాకింగ్ కామెంట్స్!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) రాష్ట్రం పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు.

Update: 2024-11-22 07:05 GMT

Full View

దిశ,వెబ్‌‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) రాష్ట్రం పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో ప్రభాస్‌తో(Hero Prabhas) తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్‌తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆమె ఆరోపించారు. ‘నేనెప్పుడూ ప్రభాస్‌ను చూడలేదు. నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా.. ఇప్పుడు చెబుతున్నా’ అని వైఎస్ షర్మిల అన్నారు. జగన్‌కు తనపై ప్రేమ ఉంటే ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు అని షర్మిల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం జగన్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని షర్మిల అన్నారు. ఈ అవినీతి కేసుతో ఆదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆమె విమర్శించారు.

Read More : నేనెందుకు పట్టించుకోవాలి.. నాకేం అవసరం..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

Tags:    

Similar News