‘పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నాను’..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని నేడు సందర్శించి సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో సమావేశమయ్యారు.

Update: 2024-07-03 12:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడ తీరాన్ని నేడు సందర్శించి సాయంత్రం 4 గంటలకు పిఠాపురంలో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం పిఠాపురంలో జరుగుతున్న వారాహి సభలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. నేడు(బుధవారం) పిఠాపురం వారాహి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు, అధికారులు భయపడుతూ ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండారని వైసీపీ నేతలు అన్నారు. పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నాను. నేను ఇక్కడే ఉంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఘన విజయం సాధించామని గుర్తుచేశారు. వంద శాతం స్ట్రయిక్ విజయం మామూలు విషయం కాదు అన్నారు. వైసీపీ నేతలు పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకడు అన్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ గేటు తాకడం కాదు..గేటు బద్దలు కొట్టుకొని వెళ్ళాం అని పవన్ పేర్కొన్నారు. గొప్పవిజయానికి పిఠాపురం నుంచే బీజం పడింది. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని పవన్ తెలిపారు. ఈక్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి కేంద్రికరించామని..పిఠాపురాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అధికారులతో పార్టీ నేతలు మర్యదగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 


Similar News