AP News:నా వయసు చిన్నదే..మళ్లీ అధికారంలోకి వస్తాం..తేల్చి చెప్పిన వైఎస్ జగన్

ఏపీలో ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-06-14 11:52 GMT
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటమి అనంతరం వైసీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపై డీలా పడొద్దంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తమ ఎంపీలకు తాజాగా ధైర్యం చెప్పారు. తనదింకా చిన్న వయసేనని, మళ్లీ అధికారం చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. ‘వైసీపీ పార్టీని నమ్ముకుని కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. లక్షాలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఉన్నారని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే మన ఓట్లు 10 శాతం మాత్రమే తగ్గాయి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు అని పార్టీ నేతలకు సూచించారు.


Tags:    

Similar News