AP:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవానికి భారీ ఏర్పాట్లు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో నేటి(మంగళవారం) నుంచి 7 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తామని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు.

Update: 2024-08-27 08:53 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో నేటి(మంగళవారం) నుంచి 7 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తామని  ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వెల్లడించారు. నిన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సెప్టెంబర్‌ 2వ తేదీన పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజని తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఉద్ధేశం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడమని తెలిపారు. అందుకని పలు సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్ని స్కూళ్లలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం, 12 పంపుల సెంటర్‌లో ఉన్న స్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమం, కస్తూర్భా స్కూల్లో విద్యార్థులకు కాంపిటీషన్స్‌ పెట్టి విజేతలకు బహుమతులు అందజేయడం, గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 2వ తేదీ పార్టీ కార్యాలయంలోనే భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, సాయంత్రం 4 గంటలకు చొదిమెళ్లలో జనసేన స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి  జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Similar News